Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ

Rahul Gandhis Letter to Telangana CM Revanth Reddy on Rohit Vemula Act
Advertisement
  • 'రోహిత్ వేముల' చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని లేఖ
  • అంబేద్కర్, రోహిత్ వేముల ఎదుర్కొన్న వివక్ష మరెవరూ ఎదుర్కోకూడదన్న రాహుల్ గాంధీ
  • రెండు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా లేఖ రాసిన రాహుల్ గాంధీ
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాష్ట్రంలో యువత హత్యలను నిరోధించేందుకు 'రోహిత్ వేముల' చట్టాన్ని తీసుకురావాలని ఆ లేఖలో కోరారు. రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు 'రోహిత్ వేముల' చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా 'రోహిత్ వేముల' చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని లేఖ రాశారు.
Advertisement
Advertisement
Rahul Gandhi
Revanth Reddy
Rohit Vemula Act
Telangana Youth Suicides
Payal Tadvi
Darshan Solanki
Caste Discrimination
Political Letter
Indian National Congress
Youth suicides in Telangana

More Telugu News